హీరో బాలకృష్ణకు దైవభక్తి ఎక్కువే. ఏ పని మొదలుపెట్టాలన్నా శుభ ఘడియలు.. మంచి ముహూర్తం చూస్తుంటారాయన. తాజాగా ‘మెహబూబా’ చిత్రం ప్రారంభోత్సవానికీ బాలకృష్ణ మంచి ముహూర్తం సూచించారట. మంగళవారం ఉదయం 8.20 గంటలకు ఆయన సూచించిన ముహూర్తానికి ‘మెహబూబా’ చిత్రం ప్రారంభోత్సవం జరిపినట్లు దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పూరి రూపొందిస్తున్న ‘మెహబూబా’ చిత్రం మంగళవారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభమైంది.
పూరి టూరింగ్ టాకీస్‌పై స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ద్వారా కన్నడ బ్యూటీ నేహాశెట్టి తెలుగుకి పరిచయమవుతున్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ –‘‘బాలకృష్ణగారు మా సినిమా ప్రారంభోత్సవానికి మంచి ముహూర్తం సూచించారు. అదే టైమ్‌కి సినిమా ప్రారంభించాం. అది మా టీమ్‌కు ఆశీర్వచనం. ఆయన ముహూర్తం టైమ్ సూచించడంతో పాటు ఫోన్ చేసి, షూటింగ్ విశేషాలు తెలుసుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment