‘ఐలవ్‌ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు’ | Puris Romantic Telugu Movie First Video Song Out | Sakshi
Sakshi News home page

‘ఐ లవ్‌ యూ.. సరదా తీరిపోద్ది’

Published Sat, Dec 21 2019 8:31 PM | Last Updated on Sat, Dec 21 2019 9:02 PM

Puris Romantic Telugu Movie First Video Song Out - Sakshi

‘దేశాన్ని ప్రేమించటం వేరు.. ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐలవ్‌ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు.. ఐ లవ్‌ యూ.. సరదా తీరిపోద్ది’ప్రస్తుతం ఈ లిరిక్స్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటివరకు డైలాగ్‌లు రాయడం వరకే పరిమితమైన డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తాజాగా మరో ముందడుగేసి ఓ​ పాట రాశాడు తన కొడుకు ఆకాశ్‌ కోసం. ఆకాశ్‌ పూరి హీరోగా ముంబై భామ కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్‌’. 

ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘రొమాంటిక్‌’ చిత్రంలోని ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే ఫస్ట్‌ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటకు పూరి స్వయంగా లిరిక్స్‌ అందించగా.. చిన్మయి శ్రీపాద ఆలపించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతమందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పూరి రైటింగ్‌ స్కిల్స్‌కు నెటిన్లు ఫిదా అవుతున్నారు. 

పూరి దర్శకత్వంలో వచ్చిన మెహబూబా ఫలితం బెడిసి కొట్టడంతో ఎలాగైనా తన కొడుకుతో హిట్‌ కొట్టించాలనే కసితో ఉన్నాడు ఈ ఇస్మార్ట్‌ డైరెక్టర్‌. దీనిలో భాగంగా కొడుకు ఆకాష్‌ కోసం పక్కా లవ్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశాడు. అయితే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అనిల్‌ పాదూరికి అప్పగించాడు. కాగా,  స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.


‘నువ్వు నేను ఈ క్షణం’ వీడియో సాంగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement