
తర్వాత సినిమా డాడీ డైరక్షన్‌లోనే
కోటవురట్ల: బాపిరాజు కొత్తపల్లి ‘పోరగాడు’ వెండితెరపై వెలిగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. బాల నటుడిగా అందరి మన్ననలు పొంది ఇపుడు వర్ధమాన హీరోగా తొలి అడుగు వేశాడు. మరికొంత సమయం తీసుకుని మరో అడుగు వేసేందుకు తయారవుతున్నాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, కోటవురట్ల మండలం బి.కె.పల్లిలో పుట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరక్టర్‌గా ఎదిగిన పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. ఆకాష్ పూరీ తన తాత సింహాచల నాయుడు జయంతిని జరుపుకోవడానికి స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా తన మనోభావాలను సాక్షి విలేకరితో పంచుకున్నాడు.
*మా డాడీ తీసిన సినిమాలు చూసి హీరోలా డైనమిక్‌గా ఉండాలనిపించింది. అది సినిమాల్లోనే సాధ్యపడుతుంది కదా.. అందుకే రెండో తరగతి చదివే సమయంలోనే నటించాలనిపించింది.
*చిరుత, బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్, బిజినెస్‌మేన్, దోనీ, గబ్బర్‌సింగ్, లోటస్‌పాండ్ సినిమాల్లో బాలనటుడిగా నటించాను. లోటస్‌పాండ్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో చిల్డ్రన్స్ విభాగానికి నామినేట్ అయింది.
*హీరో చిన్నప్పటి పాత్రలు చేశాను కదా.. ఇక హీరో కూడా కావాలనిపించింది
*ఆంధ్రాపోరి తక్కువ బడ్జెట్‌తో తీశారు. రెస్పాన్స్ బాగానే ఉంది. హీరోగా బాగానే స్వాగతించారు. డాడీ క్రేజ్ కూడా ఉంది కదా.
*తర్వాత సినిమా ఇప్పుడే కాదు.. మూడేళ్ల గ్యాప్ తీసుకుంటున్నాను. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో బాగా తర్ఫీదు పొందాలనుకుంటున్నాను.
*డాడీ అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరుస్తానంటున్నారు.
*ఇష్టమైన డైరక్టర్.. మా డాడీయే. ఆయన తీసిన సినిమాలు ఎపుడూ కొత్తదనంగానే ఉంటాయి.
*యాక్షన్‌తో కూడిన పాత్రలంటే ఇష్టం.
*తర్వాత సినిమా డాడీ డైరక్షన్‌లోనే. మా డాడీ డైరక్షన్, గణేష్ బాబాయ్ నిర్మాతగా నేను, సాయి బాబాయ్ కలిసి నటించాలని ఉంది.
*నాకు నచ్చిన హీరో, హీరోయిన్ రజనీకాంత్, సమంత.
*ఇపుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.