Jai andhra pradesh
-
‘టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి’
-
‘వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారు’
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని వైఎస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హోదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బాలినేని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజిలు తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడని బాలినేని విమర్శించారు. ఒంగోలు ఇస్లాంపేటలో సోమవారం జరిగిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ విశాఖలో వైఎస్ జగన్ సభకు యువత పోటెత్తారన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ ఎంత బలంగా ఉందో, సభకు వచ్చినవారిని చూస్తే తెలుస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని బాలినేని సూచించారు. -
‘టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి’
విజయవాడ: విశాఖ ’జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ 5కోట్లమంది ప్రజలు వైఎస్ జగన్ ప్రసంగాన్ని అభినందిస్తుంటే... టీడీపీ నేతలు మాత్రం విమర్శిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ కాకుండా మరెవరైనా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్లు ఉన్నారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని జోగి రమేష్ సూచించారు. కేసుల నుంచి విముక్తి కోసం ప్రధాని మోదీ దగ్గర చంద్రబాబు నాయుడు మోకరిల్లారని ధ్వజమెత్తారు. బికినీ సంస్కృతిలో లోకేష్ పెరిగాడని బికినీ ఫెస్టివల్ నిర్వహిస్తారా? అంటూ జోగి రమేష్ సూటిగా ప్రశ్నించారు. -
మోదీని తిట్టకపోతే టీడీపీ ఊరుకునే పరిస్థితి లేదు
-
‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకాలు
-
‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు ఆటంకాలు
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుయుక్తులు పన్నింది. జనం సభకు రాకుండా చేసేందుకు అడ్డంకులు సృష్టించింది. సభ జరిగిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలోకి ప్రజలను వెళ్లనీయకుండా పోలీసులు నియత్రించారు. స్టేడియం గేట్లు మూసివేసి సభకు వచ్చిన ప్రజలను అడ్డుకున్నారు. దీంతో వేలాది ప్రజలు స్టేడియం వెలుపలే ఉండిపోయారు. సభ జరుగుతున్నంతసేపు ప్రజలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు బయటే ఉండిపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభా ప్రాంగణంలోకి వస్తున్న సమయంలోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కార్యకర్తలను విచక్షణారహితంగా తోసేశారు. స్టేడియం గేట్లు అన్ని తెరిచి ప్రజలను లోపలికి అనుమతించాలని వేదికపై నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు పదేపదే విజ్ఞప్తి చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు. పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడతారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి మైకులో హెచ్చరించారు. ప్రజలను లోపలికి రానివ్వాలని కోరారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. -
లోకేశ్ పై ఎమ్మెల్యే రోజా సెటైర్
విశాఖపట్నం: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ప్రత్యేక హోదాను ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళుతున్న బాబును ప్రజలు చొక్కాపట్టుకుని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్ఆర్ సీపీ ఆదివారం నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దగా పడ్డ తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పేందుకే ప్రత్యేక హోదా ఉద్యమం చేపట్టామన్నారు. శ్రీశ్రీ, గురజాడ, తెన్నేటి నడయాడిన ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అధికార మదంతో తెలుగు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధిచెప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్లుగా పోరాడుతున్నారని.. ధర్నాలు, బంద్ లు చేపట్టారని తెలిపారు. ప్రాణాలు లెక్కచేయకుండా ఆమరణ దీక్షలు చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయన్నారు. 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చాలా గొప్పగా చెప్పి 11 నెలలు దాటినా ఒక్క ఉద్యోగం రాలేదని విమర్శించారు. జై ఆంధ్రప్రదేశ్ సభతో అధికార పార్టీ నేతలు వణికి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం లేదని వ్యాఖ్యానించిన నారా లోకేశ్... కామెడీ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కామెడీ విలన్ కు తక్కువ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారని, టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కనీసం వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకునే ధైర్యం ఉందా నిలదీశారు. వెన్నుపోటు బ్రదర్స్ గా మారిన వెంకయ్య, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటే ప్రతి ఒక్కరు జగనన్న వెంట నడవాలని కోరారు. -
లోకేశ్ పై ఎమ్మెల్యే రోజా సెటైర్
-
'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు'
-
'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు'
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి చెందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మచిలీపట్నం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉమా శంకర్ గణేశ్ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్ఆర్ సీపీ నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 15 ఏళ్లు హోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే స్పెషల్ ప్యాకేజీ అంటూ మాట మార్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి రైతు, మహిళ, అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండాలంటే జగన్ సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సాధన కోసం ఒక్కపక్క, ప్రత్యేక హోదా కోసం మరో పక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పైలా విజయ కుమార్ అన్నారు. ప్రతిపక్షం పాత్రకు జగన్ సంపూర్ణ న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా మాటను చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు. ప్రతిదాన్ని నంబర్ వన్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు.. హుద్ హుద్ తుపాను బాధితులకు ఎటువంటి సహాయం చేయలేదన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ మరికాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. తొలుత నగరంలోని సర్క్యూట్ హౌస్‌కు ఆయన వెళ్తారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభాస్థలికి చేరుకుంటారు. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ప్రయోజనం లేని ప్యాకేజీని స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వాల తీరును 'జై ఆంధ్రప్రదేశ్' సభలో నేతలు ఎండగట్టనున్నారు. -
జై ఆంద్రప్రదేశ్ సభకు మేము సిద్ధం
-
రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ
-
రేపు విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ
ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు... ముస్తాబవుతున్న నగరం సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతోంది. రాష్ట్రాభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే జై ఆంధ్రప్రదేశ్ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణానికి స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం, సభా వేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. సభకు తరలివచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఐదు కోట్లమంది ఉద్యమం రాజధానిలో ఉద్యోగాలను దూరం చేసిన ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా 1972లో రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో యువత ప్రత్యేక రాష్ర్టం కోసం ‘జై ఆంధ్ర’ నినాదంతో మహోద్యమం సాగించిన సంగతి తెల్సిందే. నేడు సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా లభించిన ‘ప్రత్యేక హోదా’ను పాలకులు నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలను దూరం చేయడానికి నిరసనగా ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ‘యువభేరి’ సదస్సులతో యువతను చైతన్యపరుస్తున్న జగన్మోహన్రెడ్డి ఇపుడు ప్రత్యేక హోదా సాధన కోసం ‘జై ఆంధ్రప్రదేశ్’ నినాదంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇపుడు ఈ ఉద్యమం ఐదు కోట్ల మంది ఆంధ్రుల చేతుల్లోకి వెళ్లింది. ఏర్పాట్లను సమీక్షిస్తున్న విజయసాయిరెడ్డి విశాఖ తరహాలోనే జై ఆంధ్రప్రదేశ్ సభలను రాష్ర్టవ్యాప్తంగా మరో ఐదు చోట్ల నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విశాఖపట్నంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, రాష్ర్ట ప్రొగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా తదితరులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో సభఏర్పాట్లను పరిశీలించారు. ఆయన సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు దగా చేసిన తీరు, రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సభపై కక్ష సాధింపు జై ఆంధ్రప్రదేశ్ సభ కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖలోని ప్రధాన కూడళ్లు, రహదారులను పార్టీ జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ జెండాలతో నిండిపోయాయి. అయితే నగర పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి జెండాలు, తోరణాల్ని తొలగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఓ పక్క జనచైతన్య యాత్రల పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకోసం నగరంలో ఎక్కడపడితే అక్కడ ఆ పార్టీ జెండాలు కడుతున్నా తొలగించని అధికారులు పనిగట్టుకుని వైఎస్సార్సీపీ జెండా లు, తోరణాలను తొలగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన
-
'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన
విశాఖ : ప్రత్యేక హోదా పేరుతో దగా చేసిన పాలక పక్షాలపై యుద్ధం చేసేందుకు ఉత్తరాంధ్ర పిడికిళ్లు బిగిస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జరగనున్న 'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్లును ఆ పార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభా ప్రాంగణానికి 'తెన్నేటి విశ్వనాధం', సభా వేదికకు 'గురజాడ అప్పారావు' పేర్లను ఖరారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, తలశిల రఘురామ్, గుడివాడ అమర్నాథ్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి గత రెండురోజులుగా విశాఖలోనే ఉండి దగ్గరుండి ఏర్పాట్లును చూస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, కో ఆర్డినేటర్లు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. -
నవంబర్ 6న ’జై ఆంధ్రప్రదేశ్’ సభ
-
వచ్చే నెల 6 నుంచి 'జై ఆంధ్రప్రదేశ్'
హైదరాబాద్ : రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేనెల నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది. నవంబర్ 6నుంచి ఐదు బహిరంగ సమావేశాలను నిర్వహించనుంది. వీటిలో మొదటిది ఆరోతేదీన విశాఖపట్నంలో జరగనుంది. ఈ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వ విఫలమైన తీరును, అవినీతి రాజకీయాలను ఎండగట్టనుంది. ఈ నేపథ్యంలో సోమవారమిక్కడ జై ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికే పరిమితమై పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, వాటి అమలులో మాత్రం శూన్యం కనిపిస్తుందన్నారు. అన్ని వైపుల నుంచి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఎండగడుతున్న ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి భారీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఐదు సమావేశాలను నిర్వహిస్తున్నామని, వాటిలో మొదటిది నవంబర్ 6వ తేదీన విశాఖపట్నంలో జరగనుందని వెల్లడించారు. వరుసగా జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రబలిన అవినీతిని, ప్రత్యేకహోదా సాధనలో ప్రభుత్వం విఫలమైన తీరును చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీలోని సీనియర్ నేతలందరూ, అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకాబోతున్నారని తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ పోస్టర్ విడుదల
-
వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ పోస్టర్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ మరోమారు తన గళం విప్పనుంది. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని ఆ పార్టీ నవంబర్ 6న విశాఖపట్నంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం ఆగదని, టీడీపీ సర్కార్ దగాను ఎండగట్టేందుకే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం అయిదుచోట్ల బహిరంగ సభలు నిర్వహించి, ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ప్రజాభిప్రాయాలను తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ సాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.