
కాసేపట్లో విశాఖ చేరుకోనున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ మరికాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. తొలుత నగరంలోని సర్క్యూట్ హౌస్‌కు ఆయన వెళ్తారు. అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం.. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభాస్థలికి చేరుకుంటారు.
విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీకి మొండిచేయి చూపించిన కేంద్ర ప్రభుత్వం, ప్రయోజనం లేని ప్యాకేజీని స్వాగతించిన రాష్ట్ర ప్రభుత్వాల తీరును 'జై ఆంధ్రప్రదేశ్' సభలో నేతలు ఎండగట్టనున్నారు.