'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన | YSR congress party leaders in making the arrangements for Jai Andhra pradesh public meeing | Sakshi
Sakshi News home page

'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన

Published Fri, Nov 4 2016 6:00 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన - Sakshi

'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ :  ప్రత్యేక హోదా పేరుతో దగా చేసిన పాలక పక్షాలపై యుద్ధం చేసేందుకు ఉత్తరాంధ్ర పిడికిళ్లు బిగిస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన జరగనున్న 'జై ఆంధ్రప్రదేశ్' సభ ఏర్పాట్లును  ఆ పార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ సభా ప్రాంగణానికి 'తెన్నేటి విశ్వనాధం', సభా వేదికకు 'గురజాడ అప్పారావు' పేర్లను ఖరారు చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీ విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, తలశిల రఘురామ్, గుడివాడ అమర్నాథ్, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి  గత రెండురోజులుగా విశాఖలోనే ఉండి దగ్గరుండి ఏర్పాట్లును చూస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, కో ఆర్డినేటర్లు  ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement