సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడును ఏకి పారేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు.
'రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు. జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లలా కాకుండా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుంది. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా?
ఓడిపోతామనే భయంతో అన్ని పార్టీల నేతల ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చినా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. రూ.470 కోట్లతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారు' అని ఉమా శంకర్ గణేశ్ వ్యాఖ్యానించారు.
చదవండి: శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment