![YSRCP MLA Umashankar Ganesh Holds Rally In Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/30/vizag-rally.jpg.webp?itok=K868gFMq)
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర కార్యనిర్వహక రాజధానిగా విశాఖను గుర్తించినందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా సోమవారం విశాఖలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment