
సాక్షి, విశాఖపట్నం : మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంట్లోనే బోలేడు దొంగ ఓట్లు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే మంత్రి అయ్యన్నపాత్రుడు ఓట్ల తొలగింపు అంశంలో వైసీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంట్లో ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగించడం లేదని ఆరోపించారు.
తన ఇంట్లోనే దొంగ ఓట్లు పెట్టుకుని.. వైసీపీని విమర్శించడం.. హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అయ్యన్న వ్యవహారం చూస్తే ‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లు ఉందని ధ్వజమెత్తారు. నర్సీపట్నాన్ని రౌడీ రాజ్యంగా మార్చిన ఘనత మంత్రి అయ్యన్నదేనని ఆరోపించారు.