సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : అధికార టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. పోలవరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న క్రమంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై మూడేళ్ల క్రితం కేసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రాజాకు తుని పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు.
నేరుగా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చిన తుని రూరల్ ఎస్సై సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు అందజేశారు. కాగా మూడేళ్ల తర్వాత.. అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై కక్ష్య సాధించేందుకే యనుమల సోదరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ రాజా ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment