Tuni MLA Raja
-
మంత్రి యనమల వేధింపులు
తుని (తూర్పుగోదావరి): ప్రజల తరఫున పోరాటం చేస్తే తనపై అన్యాయంగా కేసులు పెట్టించిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు ఇప్పుడు ఆ కేసును బయటకు తీయించి వేధింపులకు గురిచేస్తున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం సాయంత్రం తుని రూరల్ ఎస్ఐ సుధాకర్ 2015లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన సీఆర్పీసీ 41 నోటీసును ఎమ్మెల్యే రాజాకు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అందజేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే రాజా విలేకరులతో మాట్లాడారు. తుని మండలం డి.పోలవరానికి చెందిన రైతులు 17–07–2015న ఇసుక అక్రమంగా తవ్వుతున్నారని ఫోన్ చేస్తే గన్‌మెన్‌తో కలిసి వెళితే.. టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. ఇడెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ కేసును తిరగదోడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ప్రతి ఘటనలోనూ యనమల సోదరుల ఒత్తిడితో కేసులు బనాయించారన్నారు. పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకు పాత కేసులను బయటకు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని రాజా తెలిపారు. -
దాడిశెట్టి రాజాకు నోటీసులు
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : అధికార టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. పోలవరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న క్రమంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై మూడేళ్ల క్రితం కేసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రాజాకు తుని పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. నేరుగా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చిన తుని రూరల్ ఎస్సై సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు అందజేశారు. కాగా మూడేళ్ల తర్వాత.. అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై కక్ష్య సాధించేందుకే యనుమల సోదరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ రాజా ఆరోపించారు. -
ఇసుక మాఫియా బరితెగింపు
అక్రమ తవ్వకాలు అడ్డుకున్న తుని ఎమ్మెల్యే రాజాపై దాడి డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం తుని రూరల్: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆదివారం మరోమారు రెచ్చిపోయింది.వారి అక్రమాలను అడ్డుకున్న సాక్షా త్తు ఎమ్మెల్యేపైనా దాడికి తెగబడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, అతని అనుచరులు దాడికి దిగిన వివాదం సద్దుమణగకముందే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం డి.పోలవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి పాల్పడింది. ఎమ్మెల్యేను రక్షించే యత్నంలో ఉన్న ఆయన గన్మన్పైనా దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యే రాజా, గన్‌మన్ ప్రస్తుతం తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుని మండలం డి.పోలవరంలో తాండవ నది పరీవాహక ప్రాంతంలో ఇసుకను నకిలీ వే బిల్లులతో టీడీపీకి చెందిన వారు తరలించుకుపోతూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇలా బొద్దవరం గ్రామానికి చెందిన మళ్ల నరసారావు, సోదరుడు సత్యనారాయణ పొలంలో వారు ఇసుకను తవ్వేస్తున్నారు. దీనిని భూ యజమానులు అడ్డుకున్నారు.ఆగ్రహించిన బర్ల గోవిందు, ఈశ్వరరావు అనే వారు భూ యజమాని నరసారావుపై దాడిచేసి గాయపర్చారు. బాధిత రైతులు ఫోన్లో ఎమ్మెల్యే రాజాకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు.ఆ సమయంలో 13 ట్రాక్టర్లు ఇసుకలోడుతో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్నాయి.ఎమ్మెల్యే ట్రాక్టర్లకు అడ్డంగా తన వాహనాన్ని నిలిపి రెవెన్యూ, పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్లో వివరించారు. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు, రాష్ట్రమంత్రి యనమల రామకృష్ణుడు బంధువులు, అతని అనుచరగణం ట్రాక్టర్లకు అడ్డంగా ఉన్న ఎమ్మెల్యే కారును పక్కకు నెడుతుండగా వారించిన ఎమ్మెల్యే అనుచరులపై దాడులకు దిగారు. దీంతో ఎమ్మెల్యే రాజాకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన ఆయన గన్‌మెన్ నాగకన్నయ్యపైనా దాడిచేసి గాయపరిచారు. అక్కడికి చేరుకున్న సీఐ అప్పారావుకు ఎమ్మెల్యే రాజా ఫిర్యాదుచేశారు. అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయాలని కోరుతూ నకిలీ వే బిల్లులను చూపించారు. అనంతరం చికిత్సకోసం తుని వెళ్లారు.