ఓ బోగీ నుంచి పొగలు రావడంతో విశాఖపట్నం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి అరగంటపాటు నిలిపేశారు.
తుని : ఓ బోగీ నుంచి పొగలు రావడంతో విశాఖపట్నం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి అరగంటపాటు నిలిపేశారు. విశాఖపట్నంలో రాత్రి ఏడున్నర గంటలకు బయలుదేరిన ఈ రైలు 9.30కు తుని చేరుకుంది. రైలు తుని రాకముందే ఎస్-7 బోగీలో ప్రయాణికులు పొగలు రావడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో తుని రైల్వే స్టేషన్లో ఆపి పొగలు వస్తున్న బోగీని సిబ్బంది పరిశీలించారు. బోగీ అడుగున ఉండే రెండు డైనమోలలో ఒకదాని బెల్ట్ పట్టేయడంతో పొగలు వచ్చాయని గుర్తించారు. బెల్టును తప్పించి రైలును పంపించివేశారు.