ఎక్కిన ఆటో దిగి.. తెలిసిన వారి ఆటో ఎక్కడమే వారు చేసిన పాపం. మాఫియాను తలదన్నే రీతిలో వారిని వెంబ డించి, వారెక్కిన ఆటోను అటకాయించి ఓ ఆటోడ్రైవర్, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు
ప్రయాణించకపోయినా చార్జి అడిగిన ఆటోడ్రైవర్
ఇవ్వలేదని గొడవపడి.. ఇద్దరిపై అనుచరులతో దాడి
మరో ఇద్దరు అమాయకులకూ గాయాలు
తుని రూరల్, న్యూస్‌లైన్ :
ఎక్కిన ఆటో దిగి.. తెలిసిన వారి ఆటో ఎక్కడమే వారు చేసిన పాపం. మాఫియాను తలదన్నే రీతిలో వారిని వెంబ డించి, వారెక్కిన ఆటోను అటకాయించి ఓ ఆటోడ్రైవర్, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు బాధితులతో పాటు.. ఈ గొడవతో సంబంధం లేని మరో ఇద్దరికీ గా యాలయ్యాయి. ఈ సంఘటన తుని మండలం సుభద్రయ్యమ్మపేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది. తుని రూరల్ ఎస్సై జి.రమేష్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తుని మండలం ఎన్‌ఎస్‌వీ నగరానికి చెం దిన కొందరు జట్టు కూలీలు పనుల కోసం కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. పనులు పూర్తి కావడంతో అక్కడి నుంచి బస్సులో బయలుదేరి, గురువారం రాత్రి తుని బస్టాండ్‌కు చేరుకున్నారు. స్వగ్రామమైన ఎన్‌ఎస్‌వీ నగరానికి వెళ్లేందుకు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కు ఫోన్ చేశారు. అది వచ్చేలోగా.. మరో ఆటో అం దుబాటులో ఉండడంతో ఇంటికండ రాజారావు మినహా మిగిలిన వారు అందులో వెళ్లిపోయా రు. తునిలోని కొఠాం బస్టాండ్‌లోని సెలూన్‌లో రాజారావు షేవింగ్ చేయించుకునేందుకు వెళ్లా డు. అక్కడ అతడి తమ్ముడు ఇంటికండ అప్పారావు కలిశాడు. షేవింగ్ అనంతరం గ్రామానికి వెళ్లేందుకు పంపనబోయిన గోవింద్ ఆటోలో వీరు ఎక్కారు. ఈలోగా తొలుత ఫోన్ చేసిన ఆ టో అక్కడకు చేరుకుంది. దీంతో ఎక్కిన ఆటో ది గిన వీరిద్దరూ.. వచ్చిన ఆటోలో ఎక్కారు. దీం తో రాజారావు, అప్పారావును గోవింద్ ఆటో చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వారికి, గోవింద్‌కు గొడవ జరిగింది. దీంతో గో వింద్ తన అనుచరులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అప్పారావు, రాజారావు బయలుదేరి న ఆటోను గోవింద్ తన ఆటోలో వెంబడిం చాడు. మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రా మం వస్తుందనగా, సుభద్రయ్యమ్మపేట సమీపంలో డ్రైవర్ గోవింద్, అతడి అనుచరులు మిరియాల ఏడుకొండలు, పంపనబోయిన రమణ, బర్ల కృష్ణంరాజు సహా 11 మంది వారి ఆటోను అటకాయించారు.
ఆటోలో ఉన్న అప్పారావు, రాజారావులతో పాటు అదే గ్రామానికి చెందిన సోములు సత్తిబాబు, గొంప వరహాల బాబుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడి లో రాజారావు, అప్పారావు తీవ్రంగా, సత్తిబా బు, వరహాలబాబు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానికులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులఫిర్యాదు మేర కు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు.