తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె ఇప్పుడు సాధారణ హీరోయిన్ గానే కాదు. లేడీ ఓరియంటెడ్ కథా త్రాల హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటింన చిత్రం డ్రైవర్ జమున. మహిళా డ్రైవర్‌గా బలమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించారు. కింగ్స్ లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.
కాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ గురువారం ఒక ప్రైవేట్ చానల్లో మహిళా ఆటోడ్రైవర్లను కలిశారు. ఇందులో చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికిపైగా మహిళ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రీల్ మహిళా డ్రైవర్ ఐశ్వర్య రాజేష్‌తో రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. నటి ఐశ్వర్య రాజేష్ వారి సాధక బాధకలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను కానుకగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment