
వైఎస్సార్ సీపీ నేతపై దాడి
అధికార టీడీపీ నాయకల ఆగడాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి.
తుని: అధికార టీడీపీ నాయకల ఆగడాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థులపై దాడులకు తెబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేవూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నాగేశ్వరరావుపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వరరావుపై దుండగులు వెనుకాల నుంచి కత్తులతో దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.