ఉత్కంఠంగా ఖోఖో క్వార్టర్స్ ఫైనల్స్
ఉత్కంఠంగా ఖోఖో క్వార్టర్స్ ఫైనల్స్
Published Tue, Oct 4 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
తుని :
స్థానిక శ్రీప్రకాష్‌లో జరుగుతున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్రlఖోఖో పోటీలు ఉత్కంఠంగా జరుగుతన్నాయి. తెలంగాణా, ఆంధ్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్ నువ్వా నేనా అన్న రీతిలో జరిగాయి. క్వార్టర్స్‌లో విజ్ఞాస్ హైదరాబాద్, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం , శ్రీ వివేకానంద స్కూల్ తెనాలి, బ్లూమింగ్ మైండ్స్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, చిన్మయి స్కూల్ హైదరాబాదు, శుభ నికేతన కాకినాడ, శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్ పాయకరావు పేట మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. సెమీ ఫైనల్స్‌కు శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్, పాయకరావుపేట, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, శ్రీవివేకానంద స్కూల్ తెనాలి జట్లు చేరుకున్నాయని ప్రిన్సిపాల్ ఎంవీఎస్‌ఎస్ మూర్తి తెలిపారు. ఫైనల్స్‌కు చేరిన జట్లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని కన్వీనర్ పరేష్ కుమార్‌దాస్ తెలిపారు. స్పోర్ట్ప్ ఆథారిటీ పర్యవేక్షులు ఎం.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని మూర్తి వివరించారు.
Advertisement