kho kho compitations
-
ఉత్కంఠంగా ఖోఖో క్వార్టర్స్ ఫైనల్స్
తుని : స్థానిక శ్రీప్రకాష్‌లో జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్రlఖోఖో పోటీలు ఉత్కంఠంగా జరుగుతన్నాయి. తెలంగాణా, ఆంధ్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్ నువ్వా నేనా అన్న రీతిలో జరిగాయి. క్వార్టర్స్‌లో విజ్ఞాస్ హైదరాబాద్, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం , శ్రీ వివేకానంద స్కూల్ తెనాలి, బ్లూమింగ్ మైండ్స్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, చిన్మయి స్కూల్ హైదరాబాదు, శుభ నికేతన కాకినాడ, శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్ పాయకరావు పేట మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. సెమీ ఫైనల్స్‌కు శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్, పాయకరావుపేట, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, శ్రీవివేకానంద స్కూల్ తెనాలి జట్లు చేరుకున్నాయని ప్రిన్సిపాల్ ఎంవీఎస్ఎస్ మూర్తి తెలిపారు. ఫైనల్స్‌కు చేరిన జట్లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని కన్వీనర్ పరేష్ కుమార్దాస్ తెలిపారు. స్పోర్ట్ప్ ఆథారిటీ పర్యవేక్షులు ఎం.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని మూర్తి వివరించారు. -
క్లస్టర్ ఖోఖో పోటీలు ప్రారంభం
తునిరూరల్ : ఆంధ్ర, తెలంగాణ మధ్య క్లస్టర్ అంతర్ రాష్ట్ర ఖోఖో పోటీలను స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల క్రీడా మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ పరేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ క్రీడలను ఒలింపిక్ ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీలకు మూడు కోర్టులు ఏర్పాటు చేశామని, రాత్రి కూడా పోటీల నిర్వహణకు ఫ్లడ్‌లైట్లు, ఇతర సదుపాయలు కల్పించామన్నారు. స్టోర్స్ అధారిటీ నియమించిన అంపైర్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. నల్గొండ పబ్లిక్ స్కూల్, టీంపని స్టీల్ సిటీ స్కూల్ మధ్య పోటీతో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విజేతలు : టీంపని స్టీల్ సిటీ స్కూల్ (విశాఖ) జట్టుపై నల్గొండ పబ్లిక్ స్కూల్ జట్టు విజయం సాధించింది. చైతన్య సెంట్రల్ స్కూల్ (మహబూబ్‌నగర్)పై బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్ (ఖమ్మం), చైతన్య సెంట్రల్ స్కూల్ (చిత్తూరు)పై వివేకనంద రెసిడెన్సియల్ స్కూల్ (కరీం నగర్), హైదరాబాద్‌కు చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుపై విజ్ఞాన్ స్కూల్ జట్టు విజయం సాధించింది. విద్యా సంస్థల సహాయ కార్యదర్శి విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి పాల్గొన్నారు.