తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు.
తుని(తూ.గో): తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సరిగా లేవని ఒకరిని అధికారులు విడుదల చేయలేదు. బెయిల్ పై విడుదలైన మరొకరిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని ఘటన కేసులో 10 మందికి పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి పదో రోజుకు చేరింది.