
ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేయండి
తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన పరిణామాలు.............
రాజమహేంద్రవరం క్రైం : తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన పరిణామాలు, వాటికి బాధ్యులపై నమోదు చేయవలసిన కేసులపై డీజీపీ రాముడు పోలీస్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో నాలుగు గంటల పాటు జరిపిన ఈ సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి డీజీపీ పలు వివరాలు సేకరించారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబెట్టిన వారి గుర్తింపు, తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ జీప్‌లు, బైక్‌లు తగల బెట్టినవారిపై కేసుల నమోదు గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి, బాధ్యులపై కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకమైన ఈ మెయిల్ అడ్రస్, వాట్సప్ ఏర్పాటు చేసి బయట నుంచి కూడా ఆధారాలు సేకరించాలని సలహా ఇచ్చారు. అనంతరం కోస్టల్ ఐజీ కుమార్ విశ్వజిత్ వాట్సప్ నంబరు 9440904859 , ఈ మెయిల్ అడ్రస్ తుని మీటింగ్ ఎట్ రైట్ ఆఫ్ జి మెయిల్ డాట్ కామ్ పేరుతో ఏర్పాటు చేశామని, వీటికి ఫొటోలు, వీడియోలు కూడా పంపించవచ్చునని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.డీజీపీని కలిసిన గాయపడ్డ పోలీసుల కాపు ఐక్య గర్జన సందర్భంగా పోలీసులపై దాడి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాడిలో గాయపడిన పోలీసులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. గాయాలపాలైన 30 మంది పోలీసులు రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో డీజీపీని కలసి తమపై ఏవిధంగా దాడి జరిగిందీ వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ రాము డు వారి నుంచి కూడా తుని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గా యాలపాలైన పోలీసులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసంలో వాహనాలు కోల్పోయిన వారికి కొత్త వాహనాలు ఇస్తామన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బాధిత పోలీసులకు హామీ ఇచ్చారు. కాపు ఐక్య గర్జన సంఘటన వివరాలు, ఆధారాలు పడద్భందీగా సేకరించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఐదో తేదీ నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్నందున ఎలాం టిఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ రాముడు చర్చించారు. అవసరమైతే ఆదనపు బలగాలు రప్చిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆడిషనల్ డీజీ ఆర్.పి. ఠాకూర్, ద్వారకా తిరుమలరావు, సూరి కుమార్, ఎస్పీ రవిప్రకాశ్, అర్భన్ ఎస్పీ ఎస్. హరికృష్ణ పాల్గొన్నార