- తారాజువ్వ కూరుతుండగా..ముగ్గురికి తీవ్ర గాయాలు
- మహిళలను కాపాడిన పింఛన్ల పంపిణీ
- పోలీసుల అదుపులో నిర్వాహుకుడు
- క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజా
బాణసంచా కేంద్రంలో పేలుడు
Published Tue, Apr 4 2017 11:05 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
తుని :
బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన బాణసంచా పేలుడు పట్టణాన్ని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పింఛన్లు తీసుకునేందుకు మున్సిపాలిటీకి వెళ్లిన పలువురు మహిళలు పనిలోకి రాలేదు. వారు కూడా వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు, అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. బాణసంచా కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ పేలుడు సంఘటనపై పట్టణ సీఐ వి. శ్రీనివాస్, స్థానికుల కథనం ఇలా ఉంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తారాజువ్వలు, అవుట్లకు అర్డర్లు రావడంతో వాటి తయారీ కోసం బిజీగా ఉన్న పట్టణంలోని ఇసుకలపేట సమీపంలో ఉన్న వెంకటరమణ ఫైర్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో పది మంది కార్మికులు ఒక షెడ్‌లో మందుల మిశ్రమం తయారు చేస్తుంటే మరోదాంట్లో తారాజువ్వలు కూరుతున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలోని మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మందుగుండు సామగ్రి మధ్యలో ఉన్న ఇసుకలపేటకు చెందిన గెడ్డం దుర్గ (21), సాగిరెడ్డి ముసలయ్య (50), వీరవరపుపేటకు చెందిన ఆరుగలు రమేష్ (21)లను అగ్నికీలలు చుట్టిముట్టాయి. మిగిలిన కార్మికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగుతీశారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసింది. క్షతగాత్రులు ముగ్గురిని అంబులె¯Œ్సలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముసలయ్య, దుర్గలను కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు.
అగ్నిమాపక సిబ్బందికి
స్వల్ప గాయాలు
మందుగుండు ముడిసరుకులు ఉన్న షెడ్‌లో పీపాలు పేలిపోయాయి. వీటిని ఫోమ్‌తో అర్పుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. «ధైర్యం ప్రదర్శించిన ఫైర్‌మ¯ŒSలు రామచంద్రయ్య, సురేష్, రామకృష్ణలను ఆగ్నిమాపక అధికారి కేవీ రమణ అభినందించారు.
పింఛ¯ŒS కోసం మహిళలు
పనిలోకి రాలేదు..
ఈ కేంద్రంలో పనిచేస్తున్న పది మంది మహిళలు పింఛన్లు తీసుకునేందుకు వెళ్లారు. వారు కూడా పనికి వచ్చి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు రోజువారి కూలీ మాత్రమే యాజమాన్యం ఇస్తుందని చెప్పారు. తయారీ కేంద్రం వద్ద ఉన్న ఫైర్ ఫైటర్స్ సకాలంలో ఆ¯ŒS చేసి ఉంటే ప్రమాదం తప్పేదని అగ్నిమాపక అధికారి కేవీ రమణ, తహసీల్దార్ వి.సూర్యనారాయణ అన్నారు. ఈ కేంద్రానికి లైసె¯Œ్స రెన్యూవల్ చేయించారని, అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ప్రమాదంలో రూ. 4 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని తెలిపారు.
ఎమ్మెల్యే రాజా పరామర్శ
బాణసంచా పేలుడులో గాయపడిన క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు కూడా క్షతగాత్రులను పరామర్శించారు. మున్సిపల్ చైర్మ¯ŒS యినుగంటి సత్యనారాయణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS పోల్నాటి శేషగిరిరావు క్షతగాత్రులను కాకినాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాణసంచా తయారీ కేంద్రం యాజమాని సీహెచ్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
హోంమంత్రి, కలెక్టర్ పరామర్శ
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : తునిలో బాణసంచా కేంద్రంలో పేలుడుకు తీవ్రంగా గాయపడి, కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు సాదిరెడ్డి ముసలయ్య, గెడ్డం దుర్గాప్రసాద్‌లను మంగళవారం రాత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ అరుణ్‌కుమార్ పరామర్శించారు. బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుల భద్రత, ప్రాణరక్షణకు తీసుకున్న చర్యలపై సమగ్ర విచారణ చేయాలని రాజప్ప పోలీసులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహించి ఉంటే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం చేయాలని వైద్యులకు సూచించారు. బా«ధితులను ప్రభుత్వం అందుకుంటుందని
హామీ ఇచ్చారు.
ఒకరి పరిస్థితి విషమం
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
తుని శివారు ఇసుకులపేటలో బాణసంచా కేంద్రంలోని పేలుడులో తీవ్రంగా గాయపడి ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాదిరెడ్డి ముసలయ్య పరిస్థితి విషమంగా ఉంది. మరో క్షతగాత్రుడు గెడ్డం దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలతో ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. ఒళ్లంతా కాలిన గాయాలతో ఉన్న వీరిని తొలుత జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారిని అపోలోకు చేర్చారు. క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement