
5.08 కిలోల బరువుతో శిశువు జననం
తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5.08 కిలోల బరువుతో శిశువు జన్మించాడు.
తుని: తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5.08 కిలోల బరువుతో శిశువు జన్మించాడు. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్, సత్య దంపతులకు తొలి సంతానంగా ఈ బిడ్డ పుట్టాడు.
ఆ బిడ్డ 5.08 కిలోల బరువు ఉండడంతో వైద్యులు ఆశ్యర్యపోయారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, అయినప్పటికీ 72 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు.