- నాణ్యతకు తూట్లు
- ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ పనులు
- గృహనిర్మాణశాఖ సిమెంట్ వాడకం
- రూ. 2.20 కోట్లతో రోడ్డు కాలువల నిర్మాణం
పర్యవేక్షణ కరువు.. భక్షణ షురూ
Published Thu, Apr 13 2017 11:45 PM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
తుని :
దీర్ఘకాలికంగా ఉండే నిర్మాణాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే అనతికాలంలోనే శిథిలమవుతాయి. ఇందుకు గతంలో చేసిన పనులే నిదర్శనం. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమో, లేక అధికార పార్టీకి చెందిన నాయకుడని భయమో తెలియదు కాని అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్ నచ్చిన రీతిలో కాలువ నిర్మిస్తున్నారు. కాంక్రీట్‌లో ఉపయోగించే పాళ్లను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని ఎస్‌ఏ రోడ్డును వుడా నిధులు రూ.2.20 కోట్లతో విస్తరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు.
నిబంధనలు గాలికి
విశాఖ నగరపాలక అభివృద్ధి సంస్థ (వుడా) తుని మున్సిపాలిటీకి రూ. 2.20 కోట్లు మంజూరు చేసింది. ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం లక్ష్మీదేవి చెరువు వరకు రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణానికి ఆ¯ŒSలై¯ŒS టెండర్లు పిలిచారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువులకు టెండర్ దక్కింది. ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రోడ్డును 40 అడుగులకు విస్తరించి కొత్త రహదారిని నిర్మించాలి. విస్తరణలో పాత కాలువలను తొలగించి, కొత్తవి నిర్మించాలి. సుమారు 800 మీటర్ల మేర రోడ్డు, కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇటీవల పనులు ప్రారంభించారు.
గృహ నిర్మాణశాఖ సిమెంట్ వాడకం
అంచనాలో పేర్కొన్న విధంగా కాకుండా గృహనిర్మాణశాఖకు చెందిన సిమెంట్‌ను పనులకు వినియోగిస్తున్నారు. ఇది జాతీయ ఉపాధి హామీ నిధులతో చేసే పనులకు మాత్రమే ఉద్దేశించినది. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఏ సిమెంట్ వాడినా ప్రశ్నించే అధికారులు కరువయ్యారు. మార్కెట్‌లో 53 గ్రేడ్ రకం సిమెంట్ బస్తా ధర రూ.360 ఉంది. గృహనిర్మాణశాఖ సిమెంట్ బస్తా ధర రూ.230. అంటే బస్తాకు రూ.130 ఆదా అవుతుంది. రెండు అడుగుల వెడల్పు, రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు కొలతలతో నిర్మిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా 800 మీటర్ల చొప్పున 1,600 మీటర్ల కాలువ నిర్మిస్తారు. మూడు మీటర్ల కాంక్రీట్‌కు 331.20 కిలోలు (7 బస్తాలు) సిమెంట్ పడుతుంది. దీంతో 10 ఎంఎం కంకర, సిమెంట్ మాత్రమే కాంక్రీట్‌కు వాడాలి. కాంక్రీట్ రంగు కోసం క్రషర్ బూడిదను మిక్స్ చేస్తున్నారు. 1,600 మీటర్ల కాలువ నిర్మాణానికి 2,548 బస్తాల సిమెంట్ పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంచనా ప్రకారం కాలువలకు వాడే సిమెంట్‌కు రూ. 9,17,280 అవుతుంది. గృహనిర్మాణ శాఖ సిమెంట్‌కు రూ.5, 86,040 అంటే కాంట్రాక్టర్‌కు రూ.3,31,240 లబ్ధి చేకూరుతుం ది. ఇది సిమెంట్ మార్జి¯ŒSలో కలిగే ప్రయోజనం. క్రషర్ బూడిదను వినియోగించడం వల్ల ఇసుక పరిమాణం తగ్గుతుంది.
ఐదేళ్లలో రూ.35 లక్షలు వృథా
ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం రోడ్డు, కాలువలకు రూ.35 లక్షలు ఐదేళ్లలో ఖర్చు చేశారు. 2013లో రూ.20 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించారు. 2014–15లో రూ.15 లక్షలతో కాలువలు కట్టారు. ఇప్పుడు విస్తరణ పేరుతో మళ్లీ అదే రోడ్డుకు రూ.2.20 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. అధికారులకు ముందుచూపు లేకపోవడం వల్ల ప్రజలు పన్నుల రూపంలో కట్టిన రూ.35 లక్షలు వృథా అయ్యాయి. ఈ సొమ్ముతో మురికివాడల్లో రోడ్లు, కాలువలు నిర్మించి ఉంటే ప్రజలకు మేలు జరిగేదని పలువురు అంటున్నారు.
పత్తాలేని అధికారులు
రోడ్డు నిర్మాణంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణను సంప్రదించగా ఆ పనులకు, తమకు సంబంధం లేదని చెప్పారు. వుడాకు చెందిన అధికారులదే పర్యవేక్షణ బాధ్యత అన్నారు. రూ.రెండు లక్షల పనికే వర్క్ ఇ¯ŒSస్పెక్టరు ఉంటేనే పని చేయాలని చెబుతారు. రూ. 2.20 కోట్ల పనికి ఏ అధికారి లేకపోయినా కాంట్రాక్టర్ పని చేస్తున్నారు. పర్యవేక్షణ లేకపోతే నాణ్యత ప్రమాణాలు లోపిస్తాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Advertisement