జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఐఎఫ్‌ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇటువంటి క్లిప్‌నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్‌పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి..
Tiger sighting in Monsoons. This comes from Bandipur.
— Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023
VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9
Comments
Please login to add a commentAdd a comment