Viral Video: MS Dhoni Spotted Driving His Rolls Royce Car in Ranchi - Sakshi
Sakshi News home page

MS Dhoni: రోల్స్‌ రాయిస్‌ కారులో ధోని చక్కర్లు.. వీడియో వైరల్‌! ఆ కలెక్షన్‌ చూస్తే..

Published Tue, Jul 25 2023 5:59 PM | Last Updated on Tue, Jul 25 2023 6:12 PM

MS Dhoni Spotted Driving His Rolls Royce Car in Ranchi Video Viral - Sakshi

MS Dhoni Driving Rolls Royce: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి కార్లు, బైకులంటే మహాప్రీతి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంచీలోని తన ఇంట్లో ఉన్న గ్యారేజీని చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ధోని కలెక్షన్‌లో ఉన్న వింటేజీ కార్లు, బైకులు చూస్తే వాహన ప్రియులకు మతి పోవాల్సిందే!

ధోని దగ్గర అనేక రకాల విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అందులో ప్రఖ్యాత రోల్స్‌ రాయిస్‌(1980) మరింత ప్రత్యేకం. తాజాగా ఈ కారులో ధోని చక్కర్లు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. రాంచి వీధుల్లో రాయల్‌ బ్లూ కలర్‌ కారులో ధోని జామ్‌జామ్‌ అంటూ దూసుకుపోయిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

కళ్లు చెదిరేలా
కాగా ఇటీవలే.. మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కారణంగా ధోని గ్యారేజీలో ఉన్న ఆటోమొబైల్‌ కలెక్షన్‌ను చూసే అవకాశం ఫ్యాన్స్‌కు లభించింది. తాజాగా మిస్టర్‌ కూల్‌ కారు నడుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో గెలుపొందిన సీఎస్‌కే ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు(5) టైటిల్‌ గెలిచిన కెప్టెన్‌గా ధోని.. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు. 

సంపాదనలోనూ..
ఇక కెప్టెన్‌ కూల్‌ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు(టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2013) అందించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత జట్టు స్టార్‌ క్రికెటర్‌గా, సీఎస్‌కే సారథిగా ఇలా ఎన్నో విజయాలు అందుకున్న ధోని.. దాదాపు వెయ్యి కోట్లకు పైగానే ఆర్జించినట్లు అంచనా. ఇక ఇటీవలే సినీ రంగంలోనూ నిర్మాతగా అవతారమెత్తాడు ధోని. తమిళ ఇండస్ట్రీలో LGM(Lets Get Married) పేరిట సినిమా నిర్మించాడు.

చదవండి: వైరల్‌గా అపాయింట్‌మెంట్‌ లెటర్‌.. ధోని నెలజీతం ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement