అతి ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన బ్రిటిష్ అల్ట్రా లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ సరికొత్త కారును ఈ వారం ఆవిష్కరించింది. ఎలిగెన్స్ పేరుతో జెనీవా మోటారో షోలో లాంచ్ చేసిన ఈ రాయల్ కారు గురించి తెలుసుకోవాల్సిందే. అసలే కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు.. అలాంటి కారుపై వజ్రాలు పొదిగితే ఎలా ఉంటుంది.. ఎందుకంటే మామూలుగానే రోల్స్ రాయిస్ కార్లు చాలా ప్రత్యేకం. అలాంటి రాయల్ కార్లతో పోలిస్తే ఇది మరీ స్పెషల్ . దాదాపు వెయ్యి రియల్ డైమండ్ల డస్ట్ తో దీన్ని పెయింట్ చేశారు. ఈ డైమండ్ పూతను ప్రత్యేకంగా చేతితోనే రూపొందించి మరింత స్పెషల్ అప్పీల్ తీసుకొచ్చారు.
కారు టాప్ పార్ట్ డార్క్ గ్రే కలర్, దిగువ భాగం లైట్ బూడిద రంగులో డిజైన్ చేసినప్పటికీ ..ఈ కారు పై లైటింగ్ పడినపుడుమాత్రం మెటాలిక్ పెయింట్‌తో వజ్రపు కాంతుల మెరుపులతో మెరిసిపోతూ కార్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనుంది. దీనికోసం తమ టెక్నికల్ టీం రెండు నెలలు కష్టపడిందని రోల్స్ రాయిస్ తెలిపింది. యూనిక్ లైట్ ట్రాన్స్‌మిషన్, వజ్రాల కాంతి రిఫ్లెక్షన్ కోసం తమ టెక్నీషియన్స్ చాలా జాగ్రత్తగా పనిచేసినట్టు చెప్పింది. అంతేకాదు అల్ట్రా హార్డ్ డైమండ్ డస్ట్ కు ప్రత్యేక శ్రద్ధతో అతిసున్నితమైన స్మూత్ టచ్ ను తీసుకొచ్చినట్టు చెప్పింది. అన్నట్టు డై మండ్ పెయింటింగ్‌ను ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదట. అయితే దీని ధర ఎంతో కంపెనీ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఒకప్రత్యేక ప్రయివేటు కస్టమర్ కోసం దీన్ని రూపొందించారట.
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...
Published Mon, Mar 27 2017 11:06 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
Advertisement
Advertisement