ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు 'రోల్స్ రాయిస్ స్పెక్టర్'ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ కారును రెండో సారి టెస్ట్ డ్రైవ్ నిర్వహించగా..ఆ కారులో 40శాతం అభివృద్ధి సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెస్ట్ డ్రైవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రోల్స్ రాయిల్స్ ఈవీ కారును ఆ సంస్థ రెండో సారి ఫ్రెంచ్ రివేరా, దక్షిణ ఫ్రాన్స్‌లో 625,000 కిలోమీటర్ల వరకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో ఇప్పటి వరకు 2.5 మిలియన్ కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్‌ను పూర్తి చేసినట్లైంది. ఇక ఈ టెస్ట్‌లో కారులో 40 శాతం అభివృద్ధిని సాధించింది.
ఈ సందర్భంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సీఈవో టోర్‌స్టెన్ ముల్లర్ ఓట్వోస్ మాట్లాడుతూ..రోల్స్ రాయిస్ కారు తరహాలో ఈ కొత్త ఈవీ కారు ఉండదని, వాటన్నింటి కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంటే కాకుండా.. కంప్యూటింగ్ సామర్ధ్యం ,లేటెస్ట్ డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్లికేషన్ కనెక్ట్ చేసిన రోల్స్ రాయిస్ అని చెప్పారు.
అంతేకాదు ఈ కారులో స్టార్ట్ రాడ్, ట్రాన్స్వెర్స్ రాడ్ (Transverse), కాయిల్ స్పింగ్, షాక్ అబ్జార్బర్స్(అంవాంఛనీయ ఘటనలు..లేదంటే రోడ్డు ప్రమాదాల్ని నివారించే సిస్టం), డ్రమ్, కంట్రో ఆర్మ్, డ్రైవ్ యాక్సిల్ భాగాల్ని కలిపే సస్పెన్షన్ సిస్టం 'మ్యాజిక్ కార్పెట్ రైడ్' ఫీచర్లు ఉన్నాయి.
తమ సంస్థ చరిత్రలోనే తొలిసారి 1.5 మీటర్ల పొడవైన పిల్లర్ లెస్ కోచ్ డోర్‌లను ఈ ఈ కార్లలో ప్రవేశ పెట్టిందని టోర్‌స్టెన్ గుర్తు చేశారు. దాదాపు నాలుగు మీటర్ల పొడవుతో ముందు ఏ' పోల్ నుంచి వెనుక టెయిల్‌లైట్‌ల వరకు వన్ పీస్ సైడ్ ప్యానల్ విస్తరించింది ఉంది. అదేవిధంగా, పిల్లర్‌లెస్ కోచ్ డోర్లు దాదాపు 1.5 మీటర్ల పొడవుతో రోల్స్ రాయిస్ చరిత్రలో అత్యంత పొడవైనవి ఈ సందర్భంగా వివరించారు.
కారు ధర ఎంతంటే!
మోటార్ కార్లు, ఎలక్ట్రిక్ కార్ల ధరల్ని పోల్చితే.. ఈవీ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ కారుగా అవతరించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం..ఈ కారు ధర £400,000 (భారత్ కరెన్సీలో రూ.3,86,46,873.07) ఉండగా.. భవిష్యత్‌లో ఈ కారు ధర మరింత పెరిగే అవకాశం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment