న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారును కళ్లముందే ధ్వంసం చేసిన వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్‌లో భాగంగా లంబోర్ఘిని ఉరస్‌ను ఒక రష్యన్ యూ ట్యూబర్ ముక్కలు చేసి పారేశాడు. దీంతో వీడియో వైరల్‌గా గారింది. రూ. 3 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని కారును నాశనం చేయడం నెటిజన్లని షాక్‌కి గురి చేసింది. (మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్ ? షాకింగ్ వీడియో వైరల్)
వివరాల్లోకి వెళితే మిఖాయిల్ లిట్విన్ అనే పాపులర్ రష్యన్ యూట్యూబర్ లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ కోసం తన వైట్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఉరుస్ కారును కేవలం కొన్ని సెకన్లలో ధ్వంసం చేసి, ఆ వీడియో షేర్ చేశాడు. ఒక భారీ క్రేన్‌తో లంబోర్ఘిని కారుపై పడేసి, తద్వారా లిట్ డ్రింక్ చిందేలా చేయడం ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఎనర్జీ డ్రింక్ ప్రకటన కోసం రూ. 3.15 కోట్ల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన ఎస్‌యూవీని యూట్యూబర్ ముక్కలు చేయడంపై నెటిజన్లు పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టంట్‌పై స్పందించిన ఒక యూజర్ బీమా కంపెనీ పరిస్థితి ఏంటి ఒకరు వ్యాఖ్యానించారు. పాపులారిటీ కోసం యూట్యూబర్లు ఇదంతా చేస్తున్నారని కొంతమంది మండి పడ్డారు. అనవసరంగా ఇంత పొల్యూషన్ సృష్టించడం నేరమని కొందరు లైక్స్ అండ్ వ్యూస్ కోసం చేస్తున్న ఫక్తు బిజినెస్ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మహీంద్రా స్కార్పియోఎన్ రూఫ్ టాప్ లీక్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబర్ షేర్ చేసిన క్లిప్ కూడా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్ క్రియేటర్‌లు ఇలాంటి వైరల్ కంటెంట్‌ను తయారు చేయడంలో ఆరితేరిపోయారనే నవిమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment