
ఇక లంబొర్గిని లగ్జరీ ట్రాక్టర్లు
పుణే: ఇటలీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ లంబొర్గిని బ్రాండ్ లగ్జరీ కార్లనే కాకుండా అదే బ్రాండ్ కింద లగ్జరీ ట్రాక్టర్లను అందిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కే చెందిన వ్యవసాయ సంబంధిత పరికరాలు తయారు చేసే సేమ్ డజ్-ఫహర్(ఎస్‌డీఎఫ్) ప్రీమియం ట్రాక్టర్లను గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లంబొర్గని బ్రాండ్ కింద ఈ ప్రీమియం ట్రాక్టర్లను అందిస్తున్నామని ఎస్‌డీఎఫ్ ఇండియా ఎండీ, సీఈవో భాను శర్మ చెప్పారు. ధర రూ. 12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రారంభంలో 30 హెచ్‌పీ ట్రాక్టర్లను అందిస్తామని, ఆ తర్వాత 70-80 హెచ్‌పీ ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ 30 హెచ్‌పీ ట్రాక్టర్లను యూరప్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ ట్రాక్టర్లు కేవలం పొలం పనులకే కాకుండా, రిసార్టులు, స్టేడియమ్‌ల్లో కూడా వివిధ పనులకు వాడుకోవచ్చని వివరించారు.