ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో 'రెవెల్టో' (Lamborghini Revuelto) కోసం రీకాల్ జారీ చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ 8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇవన్నీ 2023 డిసెంబర్ - 2024 అక్టోబర్ మధ్యలో తయారైన కార్లు.
లంబోర్ఘిని తన రెవెల్టో కార్లకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం ప్యాసింజర్ సైడ్ విండ్‌షీల్డ్ వైపర్ సిస్టమ్‌లో సమస్య అని తెలుస్తోంది. ఈ సమస్య వైపర్ & వైపర్ మోటారు మధ్య కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది. తద్వారా.. వైపర్ మోటారును వేరు చేసి వైపర్ ఆర్మ్ పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల డ్రైవర్ సరైన దృశ్యమానతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.
రెవెల్టో కారులో సమస్య ఉన్నట్లు వినియోగదారులు కూడా వెల్లడించలేదు. కానీ కంపెనీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే ఈ రీకాల్ ప్రకటించింది. రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని రెవెల్టో 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment