
Facts On Jr NTR Buys Lamborghini: జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తారక్ దగ్గర కార్ల కలెక్షన్లు చాలానే ఉన్నాయి. 'ఇప్పుడు ఆయన గ్యారెజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. అత్యంత ఖరీధైన లంబోర్గిని ఉరుస్ మోడల్ కారును కొనేశాడు. దీని ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు.అత్యంత విలాసవంతమైన ఈ కారుతో ఎడారి ప్రాంతంలోనూ రయ్యుమంటూ రైడ్‌కి దూసుకెళ్లొచ్చు.ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కారు హైదరాబాద్ చేరుకోగానే.. ఫస్ట్ రైడ్ రామ్ చరణ్ ఇంటికి తీసుకెళ్లాడు.
కొద్ది నెలల క్రితమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లంబోర్గిని కారును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని ధర రూ. 4కోట్లు ఉండగా, ఇప్పుడు దాన్ని తారక్ దాటేశాడు. దీంతో ప్రస్తుతం అత్యంత కాస్ట్‌లీ కార్లు ఉన్న మన తెలుగు హీరోల లిస్ట్‌లో ఎన్టీఆర్ ముందున్నారు' అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ కాస్ట్‌లీ కారు గురించి ఇండస్ట్రీలోనూ జోరుగా చర్చ జరుగుతుంది. దీంతో ఈ వార్తలపై ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చారు.
'సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ కారు ఎన్టీఆర్‌ది కాదు. రామ్‌చరణ్ ఇంటి ముందు పార్క్ చేసిన ఎన్టీఆర్ కొత్త కారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కానీ ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లంబోర్గిని ఉరుస్ మోడల్‌ను బుక్ చేసిన విషయం మాత్రం వాస్తవం. కానీ అది ఇండియాకు డెలీవరీ అయ్యేందుకు మరికాస్త సమయం పడుతుంది. త్వరలోనే ఇటలీ నుంచి ఆ కారు రానుంది' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ కొత్త కారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment