అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే? | Indian billionaire Vikas Oberoi driving Lamborghini involved in supercar crash under investigation | Sakshi
Sakshi News home page

అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?

Published Thu, Oct 5 2023 3:21 PM | Last Updated on Thu, Oct 5 2023 3:37 PM

Billionaire Vikas Oberoi Investigation For Supercar crash - Sakshi

ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది.

నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.

వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్‌టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్‌టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..

ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement