
తిరువనంతపురం : వాహనాల కొనుగులకంటే కూడా వాటికి కేటాయించే నంబర్ల మీద చాలా ఎక్కువ ఖర్చు చేస్తారు జనాలు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ బిజినేస్ మ్యాన్ ఏకంగా రూ.31 లక్షలు ఖర్చు చేశాడు. వివరాలు.. కేరళకు చెందిన వ్యాపారవేత్త బాలగోపాల్... తాను ఎంతో ముచ్చటపడి కొనుకున్న కోటి రూపాయల ఖరీదైన పోర్ష్ కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో కొనుగోలు చేశారు. వేలం పాటలో రూ. 31 లక్షలు పెట్టి తాను కోరుకున్న కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం బాలగోపాల్‌తో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. దుబాయ్‌కు చెందిన వ్యక్తి వేలంలో రూ. 10 లక్షల వరకు కోట్ చేశారు. ఆ తరువాత అతను వేలం నుంచి డ్రాప్ అయ్యారు. అయితే మరో వ్యక్తి మాత్రం ఈ నంబర్ కోసం రూ. 25.50 లక్షల వరకు కోట్ చేశారు. కానీ బాలగోపాల్ ఏకంగా రూ. 31 లక్షలు చెప్పడంతో... అతను కూడా వేలం పాటు నుంచి తప్పుకున్నారు. దీంతో అత్యధిక రేటు కోట్ చేసిన వ్యాపారవేత్త బాలగోపాల్... కేఎల్ 01 సీకే 1 నంబర్‌ను సొంతం చేసుకున్నారు.
రెండేళ్ల క్రితం తాను ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న టయోటా ల్యాండ్ క్రూయిజర్ కోసం కేఎల్ 01 సీబీ 01 నంబర్‌ను వేలం పాటలో రూ. 19 లక్షలకు కొనుగోలు చేశారు బాలగోపాల్. ఓ ఫ్యాన్సీ నంబర్‌కు ఈ స్థాయిలో ధర పలకడం కేరళతో పాటు దక్షిణాదిలో కూడా ఇదే మొదటిసారి అని తెలిపారు రవాణాశాఖ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment