బెలూగా.. భలేగా.. | airbus beluga worlds largest cargo plane lands in hyderabad for third time | Sakshi
Sakshi News home page

బెలూగా.. భలేగా..

Published Sat, Aug 31 2024 6:05 AM | Last Updated on Sat, Aug 31 2024 6:05 AM

airbus beluga worlds largest cargo plane lands in hyderabad for third time

శంషాబాద్‌కు ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా

శంషాబాద్‌: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టూలూజ్‌ నుంచి థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్‌లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా (ఏ300–608ఎస్‌టీ3)  మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ ఒమన్‌ రాజధాని మస్కట్‌ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్‌ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్‌ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్‌ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్‌లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండైంది.

ప్రత్యేకతలు ఇవీ..
రష్యన్‌ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్‌–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement