cargo flight
-
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టూలూజ్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్‌లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణ
ముంబై: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ రుణ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా కార్లయిల్ ఏవియేషన్ పార్టనర్స్‌కు కంపెనీలో 7.5 శాతం ఈక్విటీ వాటాను కేటాయించనుంది. కార్గో బిజినెస్(స్పైస్‌ఎక్స్‌ప్రెస్)లోనూ కార్లయిల్ ఏవియేషన్ వాటాను సొంతం చేసుకోనుంది. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్)కు సెక్యూరిటీల జారీ ద్వారా మరో రూ. 2,500 కోట్లు సమకూర్చుకోనుంది. విమాన లీజింగ్ కంపెనీ కార్లయిల్ ఏవియేషన్‌కు చెల్లించవలసిన 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 830 కోట్లు)కుపైగా రుణాలను ఈక్విటీతోపాటు తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే డిబెంచర్లు(సీసీడీలు)గా మార్పిడి చేయనుంది. ఇందుకు స్పైస్‌జెట్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరుకి రూ. 48 లేదా సెబీ నిర్ధారిత ధరలో 7.5 శాతం వాటాను కార్లయిల్(2.95 కోట్ల డాలర్లు)కు స్పైస్‌జెట్ కేటాయించనుంది. కార్గో బిజినెస్‌కు చెందిన సీసీడీలను(6.55 కోట్ల డాలర్లు) కార్లయిల్‌కు బదిలీ చేయనుంది. వెరసి 10 కోట్ల డాలర్ల రుణ భారాన్ని తగ్గించుకోనుంది. -
స్పైస్‌జెట్‌కు ఏమైంది?.. రాడార్ సమస్యతో వెనక్కి వచ్చిన కార్గో విమానం
కోల్‌కతా: గతకొన్ని రోజులుగా విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న ఘటనలతో.. స్పైస్‌జెట్‌కు ఏమైంది అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోనూ లేవనెత్తుతున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవధిలో 8 స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఒక్క మంగళవారం రోజే రెండు విమానల్లో భద్రత సమస్యలు ఏర్పడి అత్యవసర ల్యాండింగ్ చేయగా.. తాజాగా కల్‌కతా నుంచి చైనా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. స్పైస్‌జెట్ బోయింగ్ 737 కార్గో విమానం జూలై అయిదో తేదీన కోల్‌కతా నుంచి ఛాంగ్‌క్వింగ్ వెళ్లాల్సి ఉంది. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన తరువాత విమనాంలో వాతావరణ రాడార్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి కోల్‌కతాకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. చదవండి: ముంబైలో మరో స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. గత 17 రోజుల్లో ఏడు ఘటనలు కాగా ఈ ఘటన కంటే ముందు ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించారు. అంతేగాక గుజరాత్‌లోని కాండ్లా నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగా విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ పగలడంతో ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. -
కార్గో ఫ్లైట్ ద్వారా మత్స్య సంపద ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు
-
చైనాకు వెళ్లిన హైదరాబాదీ గుండెపోటుతో..
చైనా నుంచి మృతదేహం తెప్పించండి ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం వెళ్లి గుండెపోటుతో మరణించిన నగరవాసి బాలన్ వెల్లా మృతదేహం తెప్పించేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ వేడుకోలు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ వ్యాపారం నిమిత్తం చైనాకు వెళ్లి గుండెపోటుతో మరణించిన నగరానికి చెందిన బాలన్ వెల్లా మృతదేహన్ని తెప్పించేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అతని కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జెజ్లాంగ్ ప్రావిన్స్‌లోని తైజువాలో ఈ నెల 15న బాలన్ వెల్ల మృతిచెందినట్లు చైనాలోని భారత రాయభార కార్యాలయం అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహన్ని భారత్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని, అయితే కార్గోలో తీసుకొచ్చేందుకు రూ.7,50,000 ఖర్చవుతుందన్నారు. ఆ ఖర్చును భరించే స్థోమత తమకు లేదని తెలిపారు. ప్రభుత్వం మృతదేహన్ని నగరానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చైర్ డై, స్టూల్ డై పనులు చేసే బాలన్ వెల్లా కుటుంబం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి బోయిన్‌పల్లిలోని స్వాతినికేతన్ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఇటీవల చైర్ డై, స్టూల్ డైకు సంబంధించిన మోల్డ్ కొనుగోలు చేసేందుకు వెళుతున్న ఢిల్లీకి చెందిన వ్యాపారుతో కలిసి బాలన్ వెల్లా ఈ నెల7న చైనా వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించారని, గుండెపోటుతో ఈ నెల 15న మరణించాడని భారత రాయభార అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. మృతుడికి భార్య శ్యామల, కుమారుడు, కుమార్తె ఉన్నారు.