ఎయిర్‌బస్‌కు చెందిన ఏ220 విమానాల డోర్లు ఇకపై భారత్‌లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్‌తో ఒప్పందం జరిగినట్లు యూరప్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ గురువారం ప్రకటించింది.
భారతీయ విమానయాన రంగ తయారీ సంస్థకు దక్కిన అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్టుల్లో ఇది కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. విమానాల విడిభాగాల తయారీలో భారత్ కీలకంగా మారుతుందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ ఏగుమతి చేసే సేవలు, విమాన విడిభాగాల విలువను 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఈ మార్కెట్ 750 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: లిథియం బ్లాక్‌ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ?
ఈ కాంట్రాక్టులో భాగంగా డైనమెటిక్ టెక్నాలజీస్ ఎయిర్‌బస్ 220 కార్గో, ప్యాసింజర్ విమానాల డోర్లను తయారీచేయనుంది. అందుకు సంబంధించి సర్వీసింగ్‌ను అందించనుంది. ఒక్కో విమానానికి 8 డోర్లుంటాయి. ఈ డోర్లతోపాటు వాటికి సంబంధించిన అన్ని విడిభాగాలనూ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే ఎయిర్‌బస్‌కు చెందిన ఏ330, ఏ320 విమానాల ఫ్లాప్ ట్రాక్ బీమ్‌లనూ ఈ సంస్థే తయారు చేస్తుండటం విశేషం. అలాగే ఏ220 విమానాల్లో కాక్‌పీట్ ఎస్కేప్ హ్యాచ్ డోర్లనూ ఉత్పత్తి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment