ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.
ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.
ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
ఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment