హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.
సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్‌పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్‌పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్‌సర్, భువనేశ్వర్‌కు అదనపు ఫ్లైట్స్‌ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.
ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment