ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
‘ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్‌కు వెళుతున్న ఫ్లైట్ నం 6E 1701 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్‌లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’
ఫుకెట్‌లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment