వికటించిన క్రిస్మస్‌ డిన్నర్‌.. 700 మందికి అస్వస్థత | Airlines Christmas Dinner Turns Into Health Crisis: 700 Staff Fall Sick, Know What Happened Exactly - Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు క్రిస్మస్‌ డిన్నర్‌ ఇచ్చిన ఎయిర్‌లైన్స్‌.. 700 మందికి అస్వస్థత

Published Sat, Dec 23 2023 12:53 PM | Last Updated on Sat, Dec 23 2023 1:43 PM

Airlines Christmas Dinner Turns Into Health Crisis: 700 Staff Fall Sick  - Sakshi

క్రిస్మస్‌ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ అట్లాంటిక్‌ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్‌ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్‌ డిన్నర్‌ ప్లాన్‌ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్న‌ర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచ‌నాల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

అయితే డిన్న‌ర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బ‌స్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించ‌లేదు. 

కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బ‌స్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బ‌స్ అట్లాంటిక్‌. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది ప‌నిచేస్తున్నారు. ఫుడ్ పాయిజ‌నింగ్‌కు సంబంధించిన ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ట్లు ఏఆర్తె‌ఎస్లి‌ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బ‌స్ సంస్థలో సుమారు ల‌క్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలికాప్ట‌ర్‌, డిఫెన్స్‌, స్పేస్‌, సెక్యూరిటీ ప‌రిశ్ర‌మ‌లు ఆ కంపెనీ ప‌రిధిలో ఉన్నాయి.
చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement