విమానంలో పని చేసే మహిళా సిబ్బంది అంటే స్కర్ట్‌లు, హైహిల్స్ వేసుకుని దర్శనమిస్తుంటారు. ఇక నుంచి వాటికి స్వస్తి పలికి మహిళా సిబ్బంది ఆరోగ్య సంరక్షణార్థం సౌకర్యవంతమైన యూనిఫాంని తీసుకోస్తున్నామని చెబుతోంది ఒక ఎయిర్ లైన్ సంస్ధ. ఆ వివరాలు..
ఉక్రెయిన్: మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఇక నుంచి సరొకత్త యూనిఫాంని తీసుకొస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రముఖ విమానాయాన సంస్థ స్కైఅప్ ప్రకటించింది. ఈ సంస్థ అత్యంత తక్కువ ధర కలిగిన అతిపెద్ధ విమానయాన సంస్థ. ఇంతవరకు తమ మహిళా సిబ్బందికి పాత యూనిఫాం (హైహిల్స్, స్కర్ట్స్) వంటివి ధరించేవారని, వాటితో తమ సిబ్బంది చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నట్లు వివరించింది. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలంటే హైహిల్స్ వేసుకుని పరిగెడితే అత్యంత కష్టమవుతోందని.. పైగా ఈ పాత యూనిఫాంతో వాళ్లు చాలా విసిగిపోయారని తెలిపింది.
(చదండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!)
ఈ మేరకు మహిళా సిబ్బంది, ట్రౌజర్లు (ఫ్యాంట్లు), స్నీకర్లు (తేలికపాటి ష్యూ) ధరించవచ్చని స్కైఅప్ ఎయిర్‌లైన్స్ మార్కెటింగ్ హెడ్ మరియన్న గ్రిగోరాష్ వెల్లడించారు. అంతేకాదు 1930ల నాటి యూనిఫాంలన్నింటిని అధ్యయనం చేసి మరీ అత్యంత సౌకర్యవంతమైన నారింజ రంగు యూనిఫాంని డిజైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు స్కై అప్ సంస్థ త్వరలో తమ మహిళా సిబ్బంది ప్రయాణికులకు సరికొత్త యూనిఫాంలో స్వాగతం పలుకుతారని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment