ముంబై:వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు చెందిన ప్రైవేటు ఎయిర్ బస్ కు వేలానికి సంబంధించి బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 లోగా వేలం మరియు అమ్మకం కార్యక్రమాన్ని సేవల పన్ను శాఖ (సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాల్యా విమానానికి వేలం నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎస్.సి. ధర్మాధికారి, బీపీ కొలాబవాలాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా విమానం వేలంలోజరుగుతున్న జాప్యంపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు.
విమానం సుదీర్ఘం కాలంగా డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లో పడి వుందని వ్యాఖ్యానించిన బెంచ్ ..తక్షణమే దాని వేలానికి సంబంధించిన అన్ని విధివిధానాలను పూర్తి చేయాలని చెప్పింది. బకాయిలు పేరుకుపోతుండగా, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తోందని వ్యాఖ్యానించింది. వేలం పూర్తి చేసి వెంటనే విమానాశ్రయంనుంచి ఎయిర్ బస్ ను గొలగించాలని ఆదేశించింది. డిశెంబర్ 15లోగా వేలం, అమ్మకం ప్రక్రియ పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది.
కాగా,మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఎయిర్ బస్ 319 రకం విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే..