Service Tax Department
-
మాల్యా లగ్జరీ జెట్ ఎట్టకేలకు అమ్ముడుపోయింది
బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాకు చెందిన లగ్జరీ జెట్‌కు కొనుగోలుదారుడు దొరికాడు. ఎట్టకేలకు ఈ జెట్ అమ్ముడుపోయింది. మూడు వేలం పాటలో కొనేవారే కరువైన ఈ జెట్‌కు, తాజాగా జరిగిన వేలంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్, ఎల్ఎల్సీ ఈ జెట్ వేలంలో అత్యధిక బిడ్ వేసి మాల్యా లగ్జరీ జెట్‌ను దక్కించుకుంది. బిడ్ ధర రూ.34.8 కోట్లుగా(5.05 మిలియన్ డాలర్లుగా) ఉంది. ఈ బిడ్‌ను బాంబే హైకోర్టు ఆమోదించింది. సేవా పన్ను విభాగం నిర్వహించిన ముందస్తు ఈ-వేలాల కంటే ఇది అత్యధిక బిడ్ అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీని బిడ్ తొలుత 1.9 మిలియన్ డాలర్లకు ప్రారంభమైంది. మాల్యా జెట్ పేరు ఎయిర్‌బస్ ఏ319-133సీ వీటీ-వీజేఎం ఎంఎస్ఎం 2650. కర్ణాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ అయిన సేవా పన్ను విభాగం ఈ వేలం నిర్వహించింది. ఈ వేలంతో మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సేవా పన్ను విభాగానికి రుణపడిన బకాయిలను, జరిమానాలను రికవరీ చేసుకునేందుకు వీలవుతుంది. ఈ జెట్‌లో 25 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణించే వీలుంటుంది. ఈ జెట్‌లోనే బెడ్రూం, బాత్రూం, బార్, కాన్ఫరెన్స్ ప్రాంతం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ జెట్‌ను సేవా పన్ను విభాగం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ముంబైలో పార్క్‌చేసి ఉంచింది. దీన్ని ఎయిర్‌పోర్టు నుంచి తొలగించాలని ఫిర్యాదులు కూడా బాంబే హైకోర్టులో దాఖలయ్యాయి. ఎయిర్‌పోర్టులో ఈ జెట్‌ను ఉంచడానికి స్థలం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సేవా పన్ను విభాగం తెలిపింది. పార్క్ అయిన జెట్ వల్ల గంటకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు కోల్పోతున్నామని పేర్కొంది. కర్నాటక హైకోర్టుతో అటాచ్ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్ దీన్ని విక్రయించాలని ఏప్రిల్‌లోనే బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఎయిర్‌లైన్ బెంగళూరుకు చెందినది. -
పన్ను ఎగవేత కేసులో సానియా హాజరవుతుందా?
హైదరాబాద్: ఆదాయ పన్ను ఎగవేత కేసులో సమన్లు అందుకున్న సానియా మీర్జా ఫిబ్రవరి16వ తేదీన సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరు కాకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. దీంతో ఆమె తరఫు ప్రతినిధి కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంలో సానియా సంబంధీకులు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె కానీ, ఆమె తరఫు వారు కానీ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరుకాకపోయినట్లయితే సానియాపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2014లో సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ రూ.కోటి అందజేసింది. ఇందుకు సంబంధించి ఆమె సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదంటూ అధికారులు తాఖీదులు అందజేశారు. నిబంధనల ప్రకారం 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను కట్టనందుకు గాను ప్రస్తుతం జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
మాల్యా విమానంవేలంపై హైకోర్టు ఆదేశాలు
ముంబై:వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు చెందిన ప్రైవేటు ఎయిర్ బస్ కు వేలానికి సంబంధించి బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 15 లోగా వేలం మరియు అమ్మకం కార్యక్రమాన్ని సేవల పన్ను శాఖ (సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాల్యా విమానానికి వేలం నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎస్.సి. ధర్మాధికారి, బీపీ కొలాబవాలాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా విమానం వేలంలోజరుగుతున్న జాప్యంపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు. విమానం సుదీర్ఘం కాలంగా డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లో పడి వుందని వ్యాఖ్యానించిన బెంచ్ ..తక్షణమే దాని వేలానికి సంబంధించిన అన్ని విధివిధానాలను పూర్తి చేయాలని చెప్పింది. బకాయిలు పేరుకుపోతుండగా, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తోందని వ్యాఖ్యానించింది. వేలం పూర్తి చేసి వెంటనే విమానాశ్రయంనుంచి ఎయిర్ బస్ ను గొలగించాలని ఆదేశించింది. డిశెంబర్ 15లోగా వేలం, అమ్మకం ప్రక్రియ పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. కాగా,మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఎయిర్ బస్ 319 రకం విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే.. -
రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ
ముంబై: దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ కార్యాలయాలపై సేవా పన్ను విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సేవా పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయన తన పేరును నమోదు చేసుకోకపోవడం ఇందుకు కారణం. సాధారణంగా సినిమా డెరైక్టర్లు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రామ్‌గోపాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు నిర్వహించారని, ఆయన స్టేట్మెంట్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.