250 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు | IndiGo ordered 250 Airbus aircraft | Sakshi
Sakshi News home page

250 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు

Published Mon, Aug 17 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

250 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు

250 ఎయిర్‌బస్ విమానాలకు ఇండిగో ఆర్డరు

న్యూఢిల్లీ: కార్యకలాపాల విస్తరణలో భాగంగా 250 ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల ఆర్డరుకు సంబంధించి ఇండిగో పూర్తి స్థాయి కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 26.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.72 లక్షల కోట్లు). గతేడాది అక్టోబర్‌లో ఈ ఆర్డరు విషయంలో అవగాహన ఒప్పం దం (ఎంవోయూ) కుదిరింది. తాజా కాంట్రాక్టుతో మొత్తం 530 విమానాల కోసం ఇండిగో ఆర్డరు ఇచ్చినట్లవుతుంది. 2005లో 100 ఏ320లకు, 2011లో మరో 180 ఏ320 నియో విమానాల కోసం కంపెనీ ఆర్డర్లు ఇచ్చింది. 2005 కాంట్రాక్టుకు సంబంధించిన 100 విమానాల డెలివరీ ఇప్పటికే పూర్తయినట్లు ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ తెలిపారు. ఇంధనం పొదుపు చేసే ఏ320 నియో విమానాలతో చౌకగా సర్వీసులు కొనసాగించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement