ఇక మేడిన్ చైనా విమానాలు.. | China to take on Boeing, Airbus with homegrown C919 passenger jet | Sakshi
Sakshi News home page

ఇక మేడిన్ చైనా విమానాలు..

Published Tue, Nov 3 2015 12:30 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

ఇక మేడిన్ చైనా విమానాలు.. - Sakshi

ఇక మేడిన్ చైనా విమానాలు..

దేశీయంగా తొలిసారి సొంత ప్యాసింజర్ విమానం తయారీ
* బోయింగ్, ఎయిర్‌బస్‌లకు పోటీ నే లక్ష్యం
* 174 సీట్ల సామర్థ్యం; వచ్చే ఏడాది పరీక్ష
బీజింగ్/షాంఘై: విమానాల తయారీ రంగాన్ని శాసిస్తున్న బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పాశ్చాత్య దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో చైనా తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న తొలి ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ సి919ని సోమవారం ఆవిష్కరించింది.

దేశ విమానయాన రంగంలో ఇదొక మైలురాయని కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా చైర్మన్ జిన్ ఝువాంగ్‌లాంగ్ అభివర్ణించారు. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 320 విమానాల తరహాలో సుమారు 174 మంది దాకా ప్రయాణించేందుకు అనువుగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది సుమారు 5,555 కిలోమీటర్ల దాకా ఎగిరే సామర్థ్యం కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది తొలి టెస్ట్ ఫ్లయిట్‌ను నడపనున్నట్లు జిన్ చెప్పారు. వ్యాపార సేవలకు అనువైనదిగా అనుమతులు లభించిన తర్వాత షాంఘై నుంచి సింగపూర్, బీజింగ్ నుంచి బ్యాంకాక్ తదితర పాపులర్ రూట్లలో వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ చైనా పర్యటన సమయంలో ఎయిర్‌బస్ కన్సార్షియం నుంచి 130 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు (విలువ సుమారు 17 బిలియన్ డాలర్లు) ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే చైనా తమ సొంత విమానాన్ని ఆవిష్కరించడం గమనార్హం. ప్రపంచంలోనే అతి పెద్ద పౌర విమానయాన మార్కెట్ చైనాలో భారీ ఎయిర్‌పోర్టులు 21 ఉన్నాయి. 2034 నాటికి చైనా అదనంగా 6,330 కొత్త విమానాలు కొనుగోలు చేయొచ్చని (విలువ 950 బిలియన్ డాలర్లు) బోయింగ్ అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement