
శంషాబాద్ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): హాంకాంగ్ విమానానికి పెనుముప్పు తప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి హాంకాంగ్‌కు చెందిన విమానం బయలుదేరిన కాసేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ తిరిగి వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దించాడు. ఆదివారం వేకువ జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున 2.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హాంకాంగ్ బయలుదేరిన కేత్వే ఫసిపిక్ ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరింది.
35 నిమిషాల తర్వాత ఓ పక్షిని ఢీకొట్టింది. దాంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్ళించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. పక్షి ఢీకొట్టిన విషయం తెలిసి విమానంలోని ప్రయాణీకులంతా వణికి పోయారు. ఈ విమానంలో 244 మంది ప్రయాణికులు ఉండగా చివరకు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం విమానాన్ని ల్యాండ్ చేసి వారందరినీ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్‌కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.