Viral Video: Aircraft Makes Emergency Landing At Bengaluru's HAL Airport - Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!

Published Wed, Jul 12 2023 11:18 AM | Last Updated on Wed, Jul 12 2023 11:49 AM

Bengaluru: Aircraft Emergency Landing At Hal Airport - Sakshi

బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది.  అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు.

వివరాల్లోకి వెళితే..  హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్‌ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్‌ ల్యాండింగ్‌ గేర్‌ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.  ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది.
 

చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement