విమానంలో గుండెపోటు.. మహిళ మృతి | Air India flight makes emergency landing at Sanganer airport | Sakshi
Sakshi News home page

విమానంలో గుండెపోటు.. మహిళ మృతి

Published Sat, Jan 28 2017 2:53 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

విమానంలో గుండెపోటు.. మహిళ మృతి - Sakshi

విమానంలో గుండెపోటు.. మహిళ మృతి

జైపూర్‌: విమానంలో గుండెపోటుకు గురైన మహిళా ప్రయాణికురాలు అనూహ్యంగా కన్నుమూసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌  విమానాశ్రయం నుంచి శనివారం ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే.. తన భర్తతో ప్రయాణిస్తోన్న సీమా అనే మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన పైలట్లు.. ఫ్లైట్‌ను రాజస్థాన్‌లోని సంగనీర్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు.

అప్పటికే సిద్ధంగా ఉన్న పోర్టు సిబ్బంది.. బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారని, అయితే చికిత్స అందేలోపే ఆమె కన్నుమూసిందని సంగనీర్‌ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌.బల్హారా మీడియాకు చెప్పారు. ఈ ఘటన అనంతరం విమానాన్ని తనిఖీచేసి ఢిల్లీకి పంపించామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement