విమానంలో గుండెపోటు.. మహిళ మృతి
జైపూర్: విమానంలో గుండెపోటుకు గురైన మహిళా ప్రయాణికురాలు అనూహ్యంగా కన్నుమూసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. తన భర్తతో ప్రయాణిస్తోన్న సీమా అనే మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన పైలట్లు.. ఫ్లైట్‌ను రాజస్థాన్‌లోని సంగనీర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
అప్పటికే సిద్ధంగా ఉన్న పోర్టు సిబ్బంది.. బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారని, అయితే చికిత్స అందేలోపే ఆమె కన్నుమూసిందని సంగనీర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆర్.ఎస్.బల్హారా మీడియాకు చెప్పారు. ఈ ఘటన అనంతరం విమానాన్ని తనిఖీచేసి ఢిల్లీకి పంపించామని పేర్కొన్నారు.