'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం' | Bombing Afghan hospital was a mistake says US military | Sakshi
Sakshi News home page

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'

Published Wed, Oct 7 2015 9:02 AM | Last Updated on Fri, Aug 24 2018 4:57 PM

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం' - Sakshi

'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'

వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆఫ్ఘాన్లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్బెల్ వివరణ ఇచ్చారు.

శనివారం కుండజ్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘాన్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.  కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్బెల్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుండజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్లో భాగంగా ఆఫ్ఘాన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్బెల్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement