అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి | US military chopper crashed in Helmand province of Afghanistan | Sakshi
Sakshi News home page

అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి

Published Tue, Jan 5 2016 10:08 PM | Last Updated on Fri, Aug 24 2018 4:57 PM

అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి - Sakshi

అమెరికా ఆర్మీ హెలికాప్టర్ పై దాడి

- తాలిబన్ల దుశ్చర్యలో యూఎస్ సైనికుడి మృతి, మరొ ఇద్దరికి గాయాలు
- అఫ్ఘానిస్థాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో ఘటన


యుద్ధం ముగిసిన సుదీర్ఘ కాలం తర్వాత అఫ్ఘానిస్థాన్ నుంచి తన సైన్యాన్ని వెనక్కి రప్పించాలని భావిస్తున్న అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ అఫ్ఘాన్ లోని హెల్మండ్ ఫ్రావిన్స్ లో యూఎస్ ఆర్మీ మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు  జరిపిన దాడిలో స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి చెందిన సైనికుడు ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

హెల్మండ్ లోని మర్జా పట్టణంలో తిరిగి విస్తరించిన తాలిబన్ల ఏరివేతకు అమెరికా- అఫ్ఘాన్ సైన్యాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో గయపడ్డ సైనికులకు చికిత్స్ అందించేందుకు వెళ్లిన మెడికల్ హెలికాప్టర్ పై తాలిబన్లు రాకెట్ లాంచర్లతో దాడి చేశారని, స్వల్పంగా ధ్వంసమైనప్పటికీ హెలికాప్టర్ ఎయిర్ బేస్ కు తిరిగిచ్చిందని, ఈ సంఘటనలో ఒక సైనికుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని యూఎస్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement